Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతా అనుకున్నట్టు జరిగితే ఇంకో రెండు నెలల్లో నాగార్జున, నాని కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ సెట్స్ మీదకు రానుంది. క్రేజీ కాంబినేషన్స్ కి పెట్టింది పేరైన భారీ నిర్మాత అశ్వనీదత్ వైజయంతి పతాకం మీద తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. భలే మంచి రోజు , శమంతకమణి వంటి రెండు యావరేజ్ మూవీస్ తీసిన ఈ దర్శకుడు చెప్పిన కధ ఇటు నాగ్ , అటు నానికి బాగా నచ్చిందట. అందుకే సాధ్యమైనంత త్వరగా దీన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు సాగుతున్నాయి. హలో మూవీ ప్రమోషన్ కోసం మీడియాతో మాట్లాడిన నాగార్జున కూడా ఈ సినిమా చేస్తున్నట్టు దాదాపుగా చెప్పేసారు. అయితే నాని మాత్రం చర్చలు జరుగుతున్నాయి, పూర్తి స్థాయిలో ఓకే అయ్యాక దానిపై మాట్లాడతా అని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తిగా సెట్ కాకుండా మాట్లాడడం బాగుండదని నాని ఇలా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ మాటలకు కూడా కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు చేస్తున్నారు.
ప్రస్తుతం నాని హీరోగా చేసిన mca , అఖిల్ హీరోగా చేసిన హలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా హలో కన్నా mca కలెక్షన్స్ బాగున్నాయని ట్రేడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియా కూడా ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని పోల్చి చూస్తున్నాయి. ప్రముఖ వెబ్ సైట్స్ రివ్యూలకు తగ్గట్టు హలో మీద మౌత్ టాక్ లేదని, అందుకే కలెక్షన్ రావడం లేదని తెలుస్తోంది. దీంతో కొడుకు అఖిల్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగార్జున కాస్త హర్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఆ బాధ కి తోడు సోషల్ మీడియా ప్రచారం కలగలిసి mca ని పోటీగా తెచ్చిన నాని మీద కోపంగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే జరిగితే వచ్చే సినిమాలో నాగార్జున తో కలిసి నటించాల్సిన నాని పాపం ఆయన్ని ఎలా ఫేస్ చేస్తారో అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి విషయాన్ని తేలిగ్గా తీసుకునే పరిణితి ఇటు నాగ్ , అటు నానిలో ఉందని వాళ్ళని దగ్గరగా చూసిన ఎవరైనా చెబుతారు.