‘లై’ నష్టం ఎంతో తెలుసా?

30-crores-loss-on-lie-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘అఆ’ చిత్రంతో నితిన్‌ 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు. ఆ చిత్రంతో నితిన్‌ స్థాయి అమాంతం పెరిగింది. ఆ కారణంగానే 14 రీల్స్‌ నిర్మాతలు నితిన్‌తో ఏకంగా 50 కోట్ల బడ్జెట్‌తో ‘లై’ చిత్రాన్ని నిర్మించారు. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హనురాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చి పెట్టినట్లుగా తెలుస్తోంది. మొదటి వారంలోనే ఈ సినిమా థియేటర్ల నుండి లేచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం రోజులు అయిన థియేటర్లలో జనాలు ఉంటున్నారా అంటే అదీ లేదు. దాంతో నష్టాలు ఊహించుకునేందుకు నిర్మాతలు భయపడుతున్నారు. 

నితిన్‌ కెరీర్‌లో ఈ చిత్రం అతి పెద్ద డిజాస్టర్‌గా మిగలబోతుంది. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘లై’ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌, ఆడియో రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌ ఇలా అన్ని రకా రైట్స్‌తో కేవలం 20 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంటే నిర్మాతలకు 30 కోట్ల నష్టం తప్పదని తేలిపోయింది. ఇంత భారీ మొత్తంలో నష్టం అంటే ఆ నిర్మాతలు మళ్లీ కోలుకుంటారో లేదో చూడాలి. మహేష్‌బాబుతో 14 రీల్స్‌ నిర్మాతలు నిర్మించిన ‘దూకుడు’ సినిమాకు కూడా భారీ నష్టాలు తప్పలేదు. ఆ నష్టాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మాతలకు ఈ షాక్‌ తప్పలేదు.

మరిన్ని వార్తలు:

లవ, కుశలు సిద్దం అవుతున్నారు

గుట్టు చప్పుడు కాకుండా మొదలైన మెగా151 మూవీ