కరోనా కాలంలో లాక్ డౌన్ సడలించడంతో పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. వాహనాల తనిఖీలు పెద్ద ఎత్తున జరుపుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు వందల కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీంతో సర్వత్రా కలకలం రేగింది.
అయితే రింగ్‌రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మూడు కార్లలో తరలిస్తున్న గంజాయిని పట్టుకొని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. గంజాయిని ఎవరి వద్ద నుంచి తీసుకువస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అనే విషయంపై కూపీలను లాగుతున్నారు పోలీసులు. అంతేకాకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఇంకెంత మంది ఈ దందాలో ఉన్నారు అనే గట్టును కూడా రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఇవన్నీ విషయాలను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసు అధికారులు వివరించారు.