Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జై లవకుశ ట్రైలర్ రికార్డు సృష్టించింది. ఆదివారం విడుదలైన ఈ ట్రైలర్ 24 గంటల్లోనే 7.54 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది. తెలుగు సినిమాల్లో అన్ని వ్యూస్ ఇంత వేగంగా దక్కించుకున్న రెండో ట్రైలర్ జై లవకుశేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ముందు బాహుబలి ఈ ఘనత దక్కించుకుంది. జై లవకుశ ట్రైలర్ సామాన్య ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానుల్నే కాదు…సినీ సెలబ్రిటీలనూ విపరీతంగా ఆకర్షించింది. ట్రైలర్ చూసి అనేకమంది ప్రముఖులు తారక్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా జై పాత్ర అందరికీ నచ్చుతోంది. ఘట్టమేదైనా… పాత్రేదైనా నేను రె..రె..రెడీ అంటూ ట్రైలర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ను ప్రేక్షకులు పదే పదే చెప్పుకుంటున్నారు.
బాబి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో నటిస్తుండటం.. జైలవకుశ అంటూ టైటిల్ వెరైటీగా ఉండటంతో తొలినుంచీ ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ లో ఆ రెస్పాన్స్ కనిపించింది. ట్రైలర్ తర్వాత సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. అటు ట్రైలర్ కు రికార్డు స్థాయి వ్యూస్ రావడంపై ఎన్టీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ స్పందన చాలా సంతోషాన్నిచ్చిందన్న ఎన్టీఆర్ గతంలో చెప్పినవిధంగానే…తన నటనతో అభిమానులందరూ తృప్తి చెందే విధంగా కష్టపడతానని తెలిపారు.
మరిన్ని వార్తలు: