పత్తా లేని కొత్త సినిమాలు

Achari America Yatra and Kanam movie public Talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ సంవత్సరంలో మొదటి సక్సెస్‌ను ‘రంగస్థలం’ దక్కించుకోగా రెండవ సక్సెస్‌ను ‘భరత్‌ అనే నేను’ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలు మినహా ఈ ఏడాది మరే సినిమాలు సక్సెస్‌ కాలేదు. రంగస్థలం చిత్రం తర్వాత రెండు మూడు సినిమాలు విడుదల అయ్యాయి. కాని అవి ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. ‘భరత్‌ అనే నేను’ చిత్రానికి పోటీగా ఆ వారం ఇతర సినిమాలు ఏమీ విడుదల కాలేదు. కాని ఆ తర్వాత వారం అంటే గత వారం ప్రేక్షకుల ముందుకు మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ మరియు ‘కణం’ చిత్రాలు విడుదల అయ్యాయి. ఆ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.

కొందరు ప్రేక్షకులకు ఆ చిత్రాలు వచ్చాయి అనే విషయం కూడా తెలియదు. రెండు అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాలే అవ్వడంతో వాటి గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఆ రెండు సినిమాలు రంగస్థలం మరియు భరత్‌ అనే నేను చిత్రం ముందు నిలవలేక పోయాయి. రెండు కూడా ఇంకా మంచి కలెక్షన్స్‌ను సాధిస్తున్న నేపథ్యంలో మంచు విష్ణుకు తీవ్ర నష్టం జరిగింది. ఆచారి అమెరికా యాత్ర సినిమాకు అనుకున్న దాంట్లో కనీసం సగం కలెక్షన్స్‌ కూడా రాలేదు. ‘కణం’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎలాగూ అంచనాలు లేవు. సాయి పల్లవి ఏదైనా మ్యాజిక్‌ చేస్తుందేమో అంతా భావించారు. కాని సాయి పల్లవితో పాటు మంచు విష్ణు కూడా మెప్పించలేక పోయాడు. ఈ దెబ్బతో మంచు విష్ణుకు మరో ఫ్లాప్‌ ఖాతాలో పడ్డట్లయ్యింది. ఇక ఈ వారం ‘నా పేరు సూర్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అల్లు అర్జున్‌. బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న రంగస్థలం మరియు భరత్‌ అనే నేను చిత్రాకు అల్లు అర్జున్‌ బ్రేక్‌ వేస్తాడా అనేది చూడాలి.