బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా వ్యవహారం తర్వాత సౌత్‌లో అంతటి వివాదాస్పదం అవుతున్న వ్యక్తి చిన్మయి. టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తన సత్తా చాటిన చిన్మయి తనపై జరిగిన లైంగిక దాడులను ఈమె చెప్పుకొచ్చింది. తనపై జరిగిన లైంగిక దాడులను మాత్రమే కాకుండా, తన స్నేహితురాళ్లపై ఇండస్ట్రీలో జరిగిన దాడులను మీడియాలో షేర్ చేసుకున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ ప్రముఖ రచయిత వైరముత్తు ఈమె గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.
వైరముత్తు గురించి ఈమె చేసిన వ్యాఖ్యలపై సినీ వర్గాల వారు ఎవరు స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆయనో గొప్ప రచయిత అవ్వడం వల్ల ఆయన గురించి మాట్లాడే సాహసం ఎవరు చేయడం లేదు. తాజాగా ఈ విషయంలో విశాల్ స్పందించాడు. చిన్మయి చేస్తున్న విమర్శలపై విశాల్ స్పందిస్తూ.. ఆమె ఆరోపణలను బేస్ చేసుకుని వైరముత్తుపై నిషేదం విధించలేమని, ఆ ఆరోపణలు నిజమేనని తేలిన తర్వాత నిషేదంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాడు. గతంలో అమలా పాల్ తనకు జరిగిన అన్యాయంను నడిగర్ సంఘం ముందుకు తీసుకు వచ్చింది. ఇప్పుడు అలాగే ఎవరికైనా అన్యాయం జరిగితే మా ముందుకు తీసుకు వస్తే న్యాయం చేస్తామని విశాల్ హామీ ఇచ్చాడు.