వైసీపీలో కీలకంగా ఉన్న హీరో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు నేడో, రేపో గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు పార్టీ పరంగా బాగా యాక్టివ్ గా ఉన్న ఆయన ఈ మధ్య పెద్దగా వైసీపీ కార్యక్రమాల్లో ఎక్కడాన్ కనిపించడం లేదు. దీంతో తనకు అసెంబ్లీ టిక్కెట్‌పై జగన్ ఎటూ తేల్చకపోవడం అసలు టిక్కెట్ ఇస్తారో లేదో అన్నట్లుగా పరిస్థితి మారడంతో ఆయన కాస్త తెలివిగా ఆలోచించి పార్టీ మారబోతున్నట్లుగా మీడియాకు లీకులిచ్చారు. పార్టీ ఏమైనా టికెట్ గురించి ఇప్పుడైనా సంప్రదింపులు జరుపుతుందన్న ఆలోచనతో. వాస్తవానికి శేషగిరిరావు గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. గల్లా అరుణ కుటుంబంతో వియ్యం ఉన్న కారణంగా వారితో కలిసి టీడీపీలో చేరాలనుకున్నారు. ఆ సమయంలో గల్లా జయ దేవ్ కు, గల్లా అరుణకు చంద్రబాబు టిక్కెట్లు ఖరారు చేశారు కానీ శేషగిరిరావుకు చాన్స్ దక్కలేదు. దాంతో నొచ్చుకున్న ఆయన వైసీపీలో చేరిపోయారు. కానీ వైసీపీలో కూడా పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఇస్తానని జగన్ ఆయన కు మాట ఇచ్చారట.
ఆ కారణంగానే ఆయన వైసీపీలో చురుగ్గానే పని చేశారు. తన సొంత ఊరు ఉన్న గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీని దృష్టిలో పెట్టుకుని పని చేసుకున్నారు. అందుకే ఘట్టమనేని అభిమానులంతా వైసీపీకి మద్దతు పలుకుతున్నారంటూ ఆయన పలుమార్లు ప్రకటించారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇలా ప్రక్తటించడం వివాదాస్పదం కూడా అయింది. అయినా శేషగిరిరావు మాత్రం మహేష్ బాబు, కృష్ణ అభిమానులందరూ వైసీపీకే ఓటేయాలని పిలుపు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి జగన్ బాబు కంటే ముందే టిక్కెట్లు ప్రకటించాలని కసరత్తు చేస్తున్నారు. కొన్ని లిస్టులు కూడా సిద్దం చేశారు. ఆదిశేషగిరిరావు పేరు ఏ నియోజకవర్గానికి పరిశీలించడం లేదని తెలుస్తోంది. ఇక కష్టమే అని భావించిన ఆదిశేషగిరిరావు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. జగన్ పిలిచి బుజ్జగించి టిక్కెట్ ఇస్తే సరే లేకపోతే ఆయన బయటకు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే టీడీపీని కాదనుకుని వెళ్ళిన ఆయనకు మళ్ళీ ఆ పార్టీ వైపే వెళ్ళడం ఇబ్బందికరమే, జనసేన వైపు చూడొచ్చు. కానీ ఆయనకు టీడీపీ సేఫ్ ప్లేస్ అని చెప్పాలి, బాబుకి మద్దతు తెలిపితే ఎదో ఒక నామినేటడ్ పదవ అయినా దక్కే అవకాశం ఉంది.