Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల సీటు ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జగన్ కు బలం ఎక్కువగా ఉందని వైసీపీ భావించే రాయలసీమ ఉపఎన్నికల్లో గెలవడం ద్వారా ఆ పార్టీని మానసికంగా దెబ్బతీయాలని చూస్తోంది. ఇందుకోసం అభివృద్ధి, కుల సమీకరణలు, సెంటిమెంట్… ఇలా అందివచ్చిన ఏ అస్త్రాన్ని వదలకుండా ప్రయోగిస్తోంది.
నంద్యాల ప్రచారానికి ఆశీర్వాద యాత్రగా పేరు పెట్టడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రిని కోల్పోయిన అఖిలప్రియను ఓటర్లే ఆశీర్వదించాలనే మీనింగ్ తో సెంటిమెంట్ ను తట్టి లేపుతూ… అసంతృప్తులను దరి జేర్చుకునే విధంగా పేరు పెట్టారని టీడీపీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నంద్యాలలో గెలవకపోతే క్యాబినెట్ నుంచి తప్పుకుంటానని సవాల్ చేసిన అఖిలప్రియ అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు.
కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని కూడా ఆశీర్వాద యాత్రలో రంగంలోకి దించారు. ఆయన వీల్ ఛైర్లోనే యాత్రకు వచ్చి జనాన్ని ఓట్లడగడం మరింత ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ప్లానింగ్, అఖిల ప్రియ దూకుడు, సీనియర్ల సహకారంతో నంద్యాల గెలుస్తామని టీడీపీ కార్యకర్తలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. శిల్పా తమ పార్టీలోకి రాగానే విజయం తమదేనని సంబరపడ్డ వైసీపీ… ఇప్పుడు మారుతున్న పరిణామాలతో టెన్షన్ గా ఉంది.
మరిన్ని వార్తలు