Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని ఇంట శుభకార్యానికి సర్వం సిద్ధం అయ్యింది. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంతల పెళ్ళికి ముహూర్తం, వేదిక ఫిక్స్ అయ్యాయి. వీరి వివాహం గోవా లో రెండు రోజుల పాటు హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. అక్టోబర్ 6 ,7 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందింది. అయితే ఆ ఆహ్వాన పత్రిక అందుకున్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. నాగచైతన్య, సమంత పెళ్లి శుభలేఖ చాలా చాలా సింపుల్ గా వుంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వ్యక్తిత్వాలకి తగ్గట్టే ఎంతో సింపుల్ గా శుభలేఖ వేయడం బాగా అప్ట్ అనిపించింది. అయినా పెళ్ళికి కావాల్సిన కొండంత ప్రేమ ఆ ఇద్దరి మధ్య ఉండగా శుభలేఖ ఎంత సింపుల్ గా ఉంటే మాత్రం ఏమి ?
మరిన్ని వార్తలు: