కాస్టింగ్‌ కౌచ్‌…సమంత అనుభవం

Akkineni Samantha Comments On Casting Couch In Film Industry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా అన్ని సినిమా పరిశ్రమల్లో ఆ మాటలకు వస్తే అన్ని రంగాల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. ఇది తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన కఠిన నిజం. కాస్టింగ్‌ కౌచ్‌ గురించి సినిమా పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. తాజాగా తెలుగు సినిమా పరిశ్రహలో ఈ విషయమై పెద్ద దుమారమే రేగుతోంది. ఈ విషయంలో సినిమా పరిశ్రమ ప్రముఖులు కూడా ఇన్వాల్వ్‌ అయ్యి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీరెడ్డి ఈ వివాదంను లేవనెత్తడంతో అంతా కూడా ఆమెకు మద్దతుగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఉద్యమం పక్క దారి పట్టిందనుకోండి అది వేరే విషయం. ఇక కాస్టింగ్‌ కౌచ్‌ గురించి స్టార్‌ హీరోయిన్స్‌ పలువురు ఇప్పటి వరకు స్పందించారు. తాజాగా సమంత ఈ విషయమై తన అనుభవంను మీడియాతో పంచుకుంది. 

‘మహానటి’ చిత్రం విడుదల సందర్బంగా సమంత మీడియాతో మాట్లాడుతూ కాస్టింగ్‌ కౌచ్‌ విషయమై మాట్లాడటం జరిగింది. సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని తాను భావిస్తున్నాను, అయితే తాను చేసిన మొదటి సినిమానే సక్సెస్‌ అవ్వడంతో తనకు కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురు కాలేదు. తనతో ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించడం కాని, కాస్టింగ్‌ కౌచ్‌కు ప్రోత్సహించడం కాని జరగలేదు అంటూ చెప్పుకొచ్చింది. తాను ఎప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడలేదని, అందుకే కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం తనకు రాలేదు అంటూ ఈ సందర్బంగా సమంత చెప్పుకొచ్చింది. ఇటీవలే అక్కినేని వారి ఇంటి కోడలు అయిన సమంత తెలుగు మరియు తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకు పోతుంది.