Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రజ్యోతి, వైసీపీ మధ్య ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితి ఇంకాస్త చెడింది. వైసీపీ లో న్యాయ విభాగంలో ఆరితేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకి పార్టీ ఈ బాధ్యతలు అప్పగించింది. చంద్రబాబు మీద ఓటుకునోటు కేసు నుంచి సదావర్తి సత్రం భూముల కేసులదాకా టీడీపీ సర్కార్ ని ఎంతోకొంత ఇబ్బంది పెట్టిన ఆర్కే ని ఇప్పుడు ఆంధ్రజ్యోతి మీదకి ప్రయోగించారు జగన్. ఆర్కే తో ఆంధ్రజ్యోతి మీద పరువునష్టం దావా వేయించారు. ఈ దావాని నాంపల్లి కోర్టు విచారణకి తీసుకుంది. ఆగష్టు 1 న ఎమ్మెల్యే ఆర్కే స్టేట్ మెంట్ తీసుకుంటామని ప్రకటించింది.
ప్రధాని మోడీని వైసీపీ అధినేత జగన్ కలిసినప్పుడు అక్కడ ఏమి మాట్లాడారు అన్న అంశం మీద ఆంధ్రజ్యోతి లో వచ్చిన కధనాన్ని, ఇటీవల nda రాష్ట్రపతి అభ్యర్థిగా కోవిద్ హైదరాబాద్ వచ్చినప్పుడు జగన్ వ్యవహారశైలి మీద రాసిన కధనాల మీద వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి అలియాస్ ఆర్కే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు . వాటిని ప్రాతిపదికగా చేసుకుని ఆంధ్రజ్యోతి మీద పరువునష్టం దావా వేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు