Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాపేరు సూర్య’. ఆర్మీ ట్రైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం మరియు కేరళ భాషల్లో కూడా భారీ క్రేజ్‌ను ఈ చిత్రం దక్కించుకుంది. పలు ఇండియన్ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. బన్నీ కెరీర్లో ఎప్పుడు లేనంతగా ఈ చిత్రం భారీ బిజినెస్‌ను చేస్తోంది. హిందీ డబ్బింగ్ రైట్స్ తాజాగా భారీ మొత్తానికి అమ్ముడు పోయిన విషయం తెల్సిందే. హిందీ మరియు మలయాళంలో బన్నీకి పిచ్చ క్రేజ్ ఉంది. అందుకే అక్కడ భారీ వసూళ్లు సాధించడం ఖాయం అంటూ ఇప్పటికే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
‘నాపేరు సూర్య’ చిత్రం కోసం బన్నీ అందుకుంటున్న పారితోషికం గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంకు నాని 15 కోట్ల పారితోషికం అందుకున్నాడని, ఇక బిజినెస్ ద్వారా వచ్చిన లాభాల్లో వాటా ద్వారా మరో 15 కోట్ల వరకు అందే అవకాశం ఉందని, సినిమా సక్సెస్ అయితే మరింతగా పారితోషికం దక్కనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా బన్నీ నా పేరు సూర్య చిత్రానికి 15 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. సినిమా సక్సెస్ అయితే ఆ పారితోషికం మొత్తం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ కెరీర్లోనే ఈ చిత్రం నిలిచిపోయే చిత్రం అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. పారితోషికం విషయంలో కూడా బన్నీ ఈ స్థాయి పారితోషికం ఇప్పట్లో తీసుకోవడం సాధ్యం కాదేమో. అను ఎమాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.