అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్ సినిమా ఇండస్ట్రీస్ కు వచ్చి చాలా కాలం అయిన ఇంతవరకు సరైనా హిట్ట్ మాత్రం పడలేదు. తన అన్న అల్లు ఆర్జున్ మాత్రం తెలుగు, మలయాళం ఇండస్ట్రీస్ లో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్నాడు. అల్లు శిరీష్ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నా ఒక్కటి సరైన సినిమా మాత్రం లేదు. ఆ మద్య వచ్చిన శ్రీ రస్తు శుభమస్తు సినిమా తప్ప చెప్పుకోదగిన సినిమాలు మాత్రం లేవు. ప్రస్తుతం ABCD అనే విభిన్న తరహా సినిమా చేస్తున్నాడు. తాజాగా మారుతీ అల్లు శిరీష్ తో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ కథకు అయన జాతిరత్నం అనే టైటిల్ ను ఖరారు చేశాడు.
అల్లు శిరీష్ బాడీకీ తగ్గటుగా కథలో కొన్ని మార్పులు చేస్తున్నాడు. అల్లు శిరీష్-మారుతీ కాంబినేషన్ లో ఇంతకు ముందు కొత్త జంట అనే చిత్రం వచ్చింది. కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ప్రస్తుతానికి మారుతీ కెరీర్ కూడా అంతగా లేదు. వెంకటేష్ తో బాబు బంగారం, నాగచైతన్యతో శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు పరాజయంపాలు కావడంతో ఈసారి ఎలాగైనా అల్లు శిరీష్ తో హిట్ట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. అటు అల్లు శిరీష్ కూడా ABCD మూవీ తో హిట్ట్ కొట్టి ట్రాక్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ సినిమా విడుదల తరువాత మారుతీ సినిమా గురుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.