Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ ఏఫీ అధ్యక్షుడిగా ఆనం రామనారాయణరెడ్డిని ఎంపిక చేస్తారన్న వార్తలు తమ్ముళ్లలో కలకలం రేపుతున్నాయి. అదేంటి ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారని వాళ్లు ఆవేదన చెందుతున్నారు. కానీ చంద్రబాబు స్కెచ్ తెలిశాక మాత్రం సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నంద్యాల ఉపెన్నిక, ఇతర సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఆనంకు పదవి ఇవ్వాలని డిసైడైనట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీ ఇప్పుడు జాతీయ పార్టీ. జాతీయ అధ్యక్షుడు బాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నంబర్ వన్, టూగా ఉన్నారు. వీరిద్దర్నీ కాదని ఏ రాష్ట్ర అధ్యక్షుడైనా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు అధ్యక్షుడిగా ఎవరుంటే ఏంటని బాబు కార్యకర్తలకు నచ్చజెబుతున్నారు. ఆనం కుటుంబానికి కాంగ్రెస్ నుంచి జంప్ చేసినా.. అనుకున్నంత న్యాయం జరగలేదని, అందుకే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని బాబు భావిస్తున్నారు.
ఆనం రామనారాయణరెడ్డి మొదట్నుంచీ వివాద రహితుడు. కాంగ్రెస్ పాలనలో కానీ, జగన్ కేసులో కానీ అవినీతి మరకలు ఆయనకు అంటలేదు. ఆర్థిక మంత్రిగా కూడా పెద్ద మనిషిగా గుర్తింపు పొందారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో మంచి పరిచయాలున్నాయి. ఆనం స్థాయికి ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కరెక్ట్ పొజిషన్ అవుతుందని అటు చంద్రబాబు, ఇటు లోకేష్ భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు: