అనసూయ గొర్రె సచ్చిందిరా..!

anchor-anasuya-new-movie-title-sachindi-ra-gorre

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జబర్దస్త్‌ కారణంగా ఎంతో మంది కమెడియన్స్‌ తెలుగు వెండి తెరకు పరిచయం అయిన విషయం తెల్సిందే. కమెడియన్స్‌తో పాటు ఇద్దరు యాంకర్స్‌ కూడా తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశారు, వారే అనసూయ, రష్మీ. వీరిద్దరు కూడా జబర్దస్త్‌ కారణంగా హీరోయిన్స్‌ కంటే కూడా అధికంగా క్రేజ్‌ను దక్కించుకున్నారు. జబర్దస్త్‌తో వచ్చిన ఇమేజ్‌తో వీరిద్దరు హీరోయిన్‌గా కూడా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్నారు. జబర్దస్త్‌కు ముందు సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్టులుగా చేసిన వీరిద్దరు ఇప్పుడు స్టార్స్‌ అయ్యారు. ప్రస్తుతం అనసూయ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్‌ ‘రంగస్థం’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే. 

రంగస్థలంతో పాటు ఈమె సోలో హీరోయిన్‌గా ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యింది. చాలా కాలంగా సోలో హీరోయిన్‌గా ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న అనసూయకు ఇన్నాళ్లకు మంచి అవకాశం దక్కింది. ఇంతకు ముందు పలువురు నిర్మాతలు సంప్రదించినప్పటికి కొన్ని కారణాల వల్ల వాటిని తిరష్కరించాను. కాని ఈ సినిమా కథ నచ్చడంతో పాటు, దర్శకుడిలో కాన్ఫిడెన్స్‌ ఉందని, అందుకే హీరోయిన్‌గా నటించేందుకు కన్ఫర్మ్‌ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఈమె హీరోయిన్‌గా చేయబోతున్న సినిమాకు ‘సచ్చిందిరా గొర్రె’ అనే వింత టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని అనసూయ ఆకర్షించింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.