Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీశైలం జలాల విషయంలో సీమకి నీరు రాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజల్ని రెచ్చగొట్టే కధనంతో దొరికిపోయిన సాక్షి మీద తెల్లవారితే ఎన్ని కధనాలు వస్తాయో అనుకుంటే అంతా తుస్సుమంది. వైసీపీని, జగన్ ని టార్గెట్ చేసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టని జ్యోతి ఈసారి మాత్రం మౌనంగా వుంది. సాక్షి తెలంగాణ ఎడిషన్ లో వచ్చిన కధనం చూస్తే ఆంధ్ర ప్రయోజనాలకు పూర్తి విఘాతం కలిగించేలా వుంది. ఈ విషయం మీద సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయినా సాక్షి గుట్టు ని కప్పెట్టడానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు నిర్ణయించుకున్నట్టు వున్నాయి. అందుకు కారణం బహిరంగ రహస్యమే .
ఇప్పుడు సాక్షి తెలంగాణ ఎడిషన్ లో వచ్చిన అంశాన్ని ఆంధ్ర ఎడిషన్ లో హైలైట్ చేస్తే ఇప్పటికిప్పుడు ఈనాడు, ఆంధ్ర జ్యోతి కి ప్లస్ కావొచ్చు. కానీ అవే కధనాల ఆధారంగా తెలంగాణాలో సాక్షి ప్రచారం చేస్తుందేమో అన్న భయం వుంది. జగన్ ఆంధ్రాలో అధికారం కోసం పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో వస్తున్న సాక్షి కధనం గురించి ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది . కానీ మిగతా పత్రికలూ చాలా సందర్భాల్లో ఒకే కధనాన్ని ప్రాంతాన్ని బట్టి మార్చేస్తున్నాయి. అంటే పత్రికలకి కూడా రాజకీయ పార్టీలకి మల్లే ప్రాంతాన్ని బట్టి అజెండా ఉంటుంది తప్ప స్థిర, నిశ్చిత అభిప్రాయం ఉండదని తేలిపోయింది. ఓ కోవలో ఇప్పుడు సాక్షి చేసిన తప్పుని హైలైట్ చేస్తే రేపు మనకి కూడా అదే పరిస్థితి వస్తే అన్న ఆలోచనతో ఆంధ్రజ్యోతి, ఈనాడు మౌనం దాల్చినట్టుంది.