Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పక్క రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ పాలిటిక్స్ పై సర్వే చేయడంపై ఏపీ మంత్రి జవహర్ మండిపడ్డారు. బాబుకు ప్రజల్లో జనాదరణ పెరుగుతుంటే చూసి ఓర్వలేకే.. జగనే కేసీఆర్ తో బూటకపు సర్వే చేయించారని విమర్శలు కురిపించారు. 2014లో కూడా జగన్ గెలుస్తాడని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడూ అదే పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు గెలుపే కేసీఆర్ కు షాక్ లా మారిందని, ఇప్పుడు 2019లో కూడా గులాబీ బాస్ షాక్ తినడానికి రెడీగా ఉండాలన్నారు జవహర్.
వైసీపీ ప్లీనరీతో ప్రజల్లో ఇమేజ్ పెరిగిందన్న వార్తల్లో నిజం లేదన్నారు జవహర్. అసలు ప్లీనరీకి కార్యకర్తలే రామని చెప్పిన పరిస్థితుల్లో.. జగన్ తనకు ఛరిష్మా లేక ప్రశాంత్ కిషోర్ ను తీసుకొచ్చి.. జనాన్ని రప్పించుకున్నారని జవహర్ కుండబద్దలు కొట్టారు. సినిమాకు ప్రోమో రిలీజ్ చేసినట్లు.. ప్రశాంత్ కిషోర్ ప్రోమో రిలీజైంది తప్ప.. అసలు ప్రజల గురించి చర్చెక్కడ జరిగిందని నిలదీశారు జవహర్.
ఇక నంద్యాలలో టీడీపీ గెలుస్తుందని, వైసీపీకి అంత సీన్లేదని తేల్చేశారు జవహర్. ఏ విషయంలోనూ జగన్ బాబుకు పోటీ కాదని, ఆయనకు ఉన్నంత అనుభవం ఎంతో.. జగన్ వయసు కూడా అంత లేదన్నారు. జగన్ కు సీఎం కావాలనే యావే కానీ.. ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనే లేదని జవహర్ చెప్పడంతో.. వైసీపీ, టీడీపీ మధ్య మరోసారి నిప్పు రాజుకున్నట్లైంది.
మరిన్ని వార్తలు: