యంగ్ టైగర్, త్రివిక్రమ్‌ల మూవీ అనగానే అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగి పోయాయి. త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ చిత్రంపై ఏమాత్రం ప్రభావం కనిపించడం లేదు. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్‌ను చేస్తోంది. ఎన్టీఆర్ గత చిత్రాలు ఏవీ కూడా ఈస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదు అంటూ ట్రేడ్ వర్గాల వారు మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు. అన్ని ఏరియాల్లో కలిపి థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు 75 కోట్ల మేరకు అమ్ముడు పోయే అవకాశం ఉంది. సినిమా విడుదల సమయంకు ఈ అమౌంట్ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఇతర రైట్స్ ద్వారా నిర్మాత ఖాతాలో మరో 50 కోట్లు పడబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఈమద్య కాలంలో శాటిలైట్ రైట్స్‌కు విపరీతంగా పెరిగింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ చానెల్ 20 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉంది. అయితే నిర్మాత మాత్రం 25 కోట్లకు ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఆడియో రైట్స్, ఆన్లైన్, ప్రైమ్ వీడియో రైట్స్, ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ ద్వారా 30 కోట్లకు తగ్గకుండా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 50 కోట్లు సునాయాసంగా వస్తాయని సమాచారం అందుతుంది. అంటే మొత్తంగా ఈ చిత్రం 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయబోతుంది. సినిమాను 75 నుండి 80 కోట్ల మద్యలో బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సినిమా విడుదలకు ముందే నిర్మాతకు ఏకంగా 50 కోట్ల మేరకు లాభాలు ఖాయంగా ఈ లెక్కలు చూస్తుంటే అనిపిస్తుంది. అక్టోబర్‌లో దసరా కనుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.