నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. అక్టోబర్ 11న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకనుక సెప్టెంబర్ 2న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టాలీవుడ్లో మామూలుగా అయితే ఇలాంటి వేడుకలు శని లేదా ఆదివారాల్లో నిర్వహిస్తారు. కాని ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను మాత్రం మంగళవారం నిర్వహిస్తున్నారు. ఎక్కువగా సెంటిమెంట్‌ను ఫాలో అయ్యే టాలీవుడ్లో ఇలా మంగళవారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ సమయంలో పలు అవాంతరాలు వ్యక్తం అయ్యాయి. సినిమాకు సంబంధించిన పలు విషయాల్లో అశుభం జరిగింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారంను విడుదల చేయడం వల్ల మరేదైనా అశుభం జరుగుతుందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. నందమూరి అభిమానులు ఈ విషయంలో ఒకింత ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు ఈచిత్రం చాలా కీలకంగా భావిస్తున్నారు. వంద కోట్లు వసూళ్లు చేస్తే తప్ప ఈ చిత్రం నందమూరి ఫ్యాన్స్‌కు సంతృప్తి ఇవ్వదు అనేది కొందరి అభిప్రాయం. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం చేయడం అంటే కాస్త ఆందోళన కలిగించే విషయమే.