Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి ఊహించని కలెక్షన్స్ వస్తున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు కలలో కూడా ఊహించని వసూళ్లు వస్తున్న నేపథ్యంలో నిర్మాత పంట పండినట్లయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించింది, సాధిస్తూనే ఉంది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా మిలియన్ మార్క్‌కు దగ్గరకు వచ్చేసింది. ఈ స్థాయి కలెక్షన్స్ కేవలం పెద్ద సినిమాలకే సాధ్యం. లాంగ్ రన్‌లో మిలియన్ మార్క్ సాధించడం అంటేనే కొన్ని సినిమాలు కిందా మీద పడుతున్నాయి. కాని అర్జున్ రెడ్డి మాత్రం చాలా సులభంగా మొదటి వారాంతంలోనే మిలియన్ మార్క్‌కు చేరువ అవ్వడం చూస్తే ట్రేడ్ పండితులు సైతం అవాక్కవుతున్నారు.
ఒక చిన్న చిత్రంగా తక్కువ స్క్రీన్స్‌లో ఓవర్సీస్‌లో ‘అర్జున్ రెడ్డి’ విడుదలైంది. ఆ తర్వాత రోజే స్క్రీన్స్ సంఖ్య డబుల్ అయ్యాయి. కలెక్షన్స్ భారీగా వచ్చాయి. వచ్చే వారాంతంలో ఈ సినిమా మరోసారి భారీ వసూళ్లు రాబడుతుంది. మొత్తంగా చూస్తే ఈ సినిమా ఓవర్సీస్‌లో రెండు మిలియన్స్‌కు అటు ఇటుగా వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు ఏపీ మరియు తెలంగాణలో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో అర్జున్ రెడ్డి హవా అలా ఇలా లేదు. మొత్తానికి అర్జున్ రెడ్డి చాలా గట్టిగా కొట్టాడు అనే టాక్ వినిపిస్తుంది.
మరిన్ని వార్తలు: