Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘ఫిదా’ సందడి కొనసాగుతున్న సమయంలో ఆ సినిమా కలెక్షన్స్ జోరుకు ‘అర్జున్‌రెడ్డి’ బ్రేక్ వేసింది. విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఒకటి లేదా రెండు వారాల పాటు జోరు కొనసాగుతుందని అంతా భావించారు. కాని మూడవ వారంలో కూడా అర్జున్ రెడ్డి హవా కొనసాగుతూనే ఉంది. బాలయ్య పైసా వసూల్‌కు అర్జున్ రెడ్డి బేజారు అవ్వాల్సిందే అనుకుంటే, అర్జున్ రెడ్డి ముందు బాలయ్య నిలువలేక పోయాడు. తాజాగా మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యుద్దంశరణం, మేడ మీద అబ్బాయి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక చేతులెతేశాయి.
అర్జున్‌రెడ్డి విడుదలైన తర్వాత రెండు వారాల్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ప్రేక్షకులు అర్జున్‌రెడ్డి దారిలోనే నడుస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్స్‌ను సాధించి టాప్ చిత్రాల జాబితాలో చేరిపోయిన అర్జున్ రెడ్డి ఇంకా అక్కడ, ఇక్కడ సందడి కొనసాగిస్తూనే ఉంది. వచ్చే వారంలో కూడా పెద్దగా ‘ఉంగరాల రాంబాబు’ మినహా పెద్ద సినిమాలు ఏమీ లేవు. కావున వచ్చే వారంలో కూడా అర్జున్ రెడ్డి హవా సాగనుందన్నమాట. ‘జైలవకుశ’ వచ్చే వరకు అర్జున్‌రెడ్డి బాక్సాఫీస్ వద్ద సందడి కొనసాగించడం ఖాయం. అంటే నెల రోజుల పాటు అర్జున్ రెడ్డి హవా కొనసాగించనున్నాడు. లాంగ్ రన్‌లో ఈ సినిమా 35 నుండి 40 కోట్ల వరకు షేర్ రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు: