జరుగుతున్నది జగన్నాటకం …. రాజకీయాలకు వాడబడని ముడి సరకు అంటూ లేదు , బ్రతికున్న మనిషే కాదు శవం, అది కాలిన తర్వాత మిగిలే బూడిద , పార్టీ ఆఫీస్ లలో వాళ్ళ చిత్రపటం …ఇందిరాగాంధీ ని కాంగ్రెస్ పార్టీ , ఎన్టీఆర్ ని టిడిపీ , రాజశేఖర్ రెడ్డి ని వై సి పీ వాడుకున్నట్లు , ఇప్పుడు వాజపేయి గారి వంతు వచ్చించి …వస్తూ వస్తూ భాజపా కి కోటి ఆశలని తీసుకొచ్చింది ..మోది ప్రధాని అయిన తరవాత ఏనాడూ పార్టీ అగ్ర శ్రేణి నాయకులకు సరైన గౌరవం దక్కలేదని , మోది ప్రవర్తన వల్ల కొందరు మనసు నొచ్చుకొని పార్టీ కార్యక్రమాలకు రావడం లేదని విమర్శలు బాహాటం గానే వినిపించాయి .. అసలే రానున్నది ఎన్నికల కాలం ..
ఇది ఇలాగే కొనసాగితే పార్టీ కి నష్టం అంటూ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కడం వాజపేయి గారు చనిపోయి భాజపా కి బాగా కలిసొచ్చిన అంశం ..పెద్దాయన శవ యాత్రలో ప్రధాని హోదా లో ఉన్న మోది నడవడం ఇప్పటికే మోది భక్తులు సోషల్ మీడియా లో ఆయను ఆకాశానికి ఎత్తేస్తున్నారు … పావులు చకచక కదిలిస్తూ వాజపేయి గారి చితాభస్మాన్ని అన్ని రాష్ట్రాల భాజపా ముఖ్య నాయకులకు పంపించడం … ఆయా రాష్ట్రాల్లో అస్తికల తో యాత్ర నిర్వహించి వివిధ నదులలో కలపడం..
వందకు పైగా కళాశాల్లో వాజపేయి గారి చితాభస్మం … ఆయన బాటలో నడకున్న , ఆయన మాటలు ఆచరించకున్న ఆయన అస్తికలని పట్టుకుని యాత్రలు , ఊరేగింపులు …రాజకీయమా వందేళ్ళు వర్దిల్లు ..