నందమూరి హరికృష్ణ మరణంతో ఫ్యామిలీ మొత్తం కలిసి పోయారు. మొన్నటి వరకు బాలకృష్ణకు ఎన్టీఆర్‌కు మద్య పచ్చగడి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఇద్దరు ఎదురు ఎదురు పడి చాలా సంవత్సరాలు అయ్యింది. ఇన్నాళ్లకు హరికృష్ణ మరణంతో బాబాయి, అబ్బాయిలు ఏకం అయ్యారు. ఇద్దరి మద్య విభేదాలు తొలగి పోయాయి. చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్‌తో కలిసి పోయాడు. ఇలాంటి సమయంలోనే బాబాయి, అబ్బాయిలను ఇకపై వరుసగా స్టేజ్‌లపై చూస్తాం అని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల హరికృష్ణ చిన్న కార్యం సందర్బంగా ఎన్టీఆర్, బాలయ్యలు చాలా సమయం మాట్లాడుకోవడం ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగించింది.
ఎలాగూ బాబాయి, అబ్బాయి కలిసి పోయారు కనుక త్వరలో నిర్వహించబోతున్న ‘అరవింద సమేత’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు బాలయ్య వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం మొదలైంది. ఇది ప్రస్తుతానికి కేవలం పుకారు మాత్రమే అని చెప్పుకోవచ్చు. కాని బాలయ్య త్చుకుంటే ఇది నిజం అవ్వడం ఖాయం, ఇద్దరు ఒక్క వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చిత్రీకరణలో ఉన్న బాలకృష్ణ ఆ సమయంకు హైదరాబాద్‌లో ఉంటే వస్తాడేమో చూడాలి. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా జూనియర్ ఎన్టీఆర్ భాగస్వామ్యం కావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక ఏమేరకు తీరుతుందో చూడాలి.