‘జైసింహా’ చిత్రంతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసి విడుదల చేయాలని భావించాడు. కాని వినాయక్‌తో సినిమాకు కథ సెట్ అవ్వలేదు. ఈలోపు ఎన్టీఆర్ చిత్రం చేసే సమయం వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాకు సమయం పడుతుందని భావించిన బాలకృష్ణ వినాయక్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయాలని భావించాడు. అందుకోసం ఒక మంచి యాక్షన్ కథను సిద్దం చేసుకురావాల్సిందిగా ఆదేశించాడు. అయితే బాలకృష్ణకు సూట్ అయ్యే యాక్షన్ కథను సిద్దం చేయించడంలో దర్శకుడు వినాయక్ విఫలం అయ్యాడు.
గతంలో వినాయక్‌తో సూపర్ హిట్ చిత్రం ‘చెన్నకేశవరెడ్డి’ని చేసిన బాలయ్య అదే తరహా చిత్రం కోసం ప్రయత్నించాడు. కాని వినాయక్ అలాంటి కథను తీసుకు రాలేక పోయాడు. ఆ కారణంగానే ఆరు నెలలు ఖాళీగానే ఉండి బాలయ్య ‘ఎన్టీఆర్’ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ అయ్యాడు. వినాయక్‌తో ఆ తర్వాత అయినా సినిమా ఉంటుందో ఉండదో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ఈమద్య కాలంలో కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనేందుకు ఇదే నిదర్శణం అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.