బెల్లంకొండ రాంగ్‌ టైమింగ్‌…!

Bellamkonda Srinivas Movie Release On December

‘అల్లుడు శీను’ చిత్రం తర్వాత వరుసగా పెద్ద చిత్రాల్లో నటిస్తూ వస్తున్న బెల్లంకొండ శ్రీను తాజాగా ‘కవచం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ మరియు మెహ్రీన్‌ నటిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌ మరియు టీజర్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. రికార్డులను బద్దలు కొట్టగల మూవీ అంటూ బెల్లంకొండ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇక ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సరైన సమయంలో ఈ చిత్రం రావడం లేదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Kavacham Teaser Launch

ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే డిసెంబర్‌లో వరుణ్‌ తేజ్‌ ‘అంతరిక్షం’ చిత్రంతో పాటు శర్వానంద్‌ పడి పడి లేచే మనసు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటు కన్నడ మూవీ ‘కెజిఎఫ్‌’ కూడా విడుదల కాబోతుంది. ఈ మూడు సినిమాలు కూడా భారీ అంచనాలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ మూవీ విడుదల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒక వేళ మూవీ విడుదల అయి సక్సెస్‌ అయినా కూడా ఇతర మూవీస్‌ వల్ల కలెక్షన్స్‌ విషయంలో తేడా కొట్టడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బెల్లంకొండ నిర్ణయాన్ని సినీ వర్గాల వారు తప్పుబడుతున్నారు.

బెల్లంకొండ రాంగ్‌ టైమింగ్‌...! - Telugu Bullet