ఈమెను కూడా వదల్లేదుగా..!

bellamkonda-srinivas-romanc

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా టాలీవుడ్‌లో దాదాపు మొత్తం స్టార్‌ హీరోయిన్స్‌తో ఆడి పాడేశాడు. తన మొదటి సినిమాలో సమంత, తమన్నాలతో రొమాన్స్‌ చేసిన ఈ యువ హీరో ఆ తర్వాత రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, పూజా హెగ్డేలతో కూడా నటించాడు. ప్రస్తుతం శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ఈయన చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది. కాజల్‌తో రొమాన్స్‌ సినిమాకు హైలైట్‌ అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ చిత్రంలోనే మరో హీరోయిన్‌ను కూడా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

బ్రిటీష్‌ మోడల్‌ అయిన అమీ జాక్సన్‌ ప్రస్తుతం రజినీకాంత్‌కు జోడీగా ‘2.0’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. బాలీవుడ్‌తో పాటు పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అమీ జాక్సన్‌ను బెల్లంకొండ శ్రీనివాస్‌ తన తాజా చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అందుకోసం భారీ ఎత్తున పారితోషికంను కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. తన ప్రతి సినిమాలో కూడా స్టార్‌ హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తున్న బెల్లంకొండ హీరో ఈసారి ఇంకో స్టెప్‌ ఎక్కాడు. శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో అమీజాక్సన్‌ రెండవ హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్‌ మామూలోడు కాదని, అమీని కూడా వదల్లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది.