Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. రాజకీయ నేపథ్యంలో మహేష్‌బాబు సినిమా ఇప్పటికే ‘దూకుడు’ వచ్చింది. ఆ సినిమాలో మహేష్‌బాబు కొద్ది సమయం మాత్రమే రాజకీయ నాయకుడిగా ఉంటాడు. అయితే ఈ చిత్రంలో మాత్రం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మహేష్‌బాబు కనిపించబోతున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యుల నుండి సమాచారం రావడంతో ఆసక్తి మరింతగా పెరిగింది. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకు ముందు నుండి కూడా ‘భరత్ అను నేను’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా, ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు.
చిత్రంకు సంబంధించిన ఏదైనా ప్రకటన చేయాల్సి వచ్చినప్పుడు మహేష్‌బాబు24 అంటూ ప్రకటిస్తూ వచ్చారు. దాంతో ‘భరత్ అను నేను’ టైటిల్ కాకుండా మరే టైటిల్‌ను అయినా ప్రకటిస్తారా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు అదే టైటిల్‌ను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. అదే టైటిల్‌ను ఇన్నాళ్లకు అధికారికంగా ప్రకటించడం వెనుక ఏదైనా ఉద్దేశ్యం ఉందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి మహేష్‌బాబు మూవీ ‘భరత్ అను నేను’ టైటిల్ ఖరారు అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇక నేడు రిపబ్లిక్ డే సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మహేష్‌బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆడియోను విడుదల చేయడం జరిగింది. మహేష్‌బాబు వాయిస్‌లో పవర్ సినిమా స్థాయిని చెప్పకనే చెబుతుంది అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఇక టైటిల్ ప్రకటన సందర్బంగా మహేష్‌బాబు లుక్‌ను కూడా అధికారికంగా రివీల్ చేయడం జరిగింది. ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను బద్దలు కొడుతుందా అనేది చూడాలి.