Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘స్పైడర్’ చిత్రంతో దారుణంగా నిరాశ పర్చిన మహేష్‌బాబు ప్రస్తుతం ‘భరత్ అను నేను’ చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రం ఆడుతుందనే నమ్మకంను అభిమానులు మరియు సినీ వర్గాల వారు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా కనిపించబోతున్నాడు అనే వార్తలు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. కాని గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి రానా మొదటి చిత్రం ‘లీడర్’కు లింక్ పెడుతున్నారు.
సీఎం హత్య కావించబడటంతో అమెరికాలో ఉండే ఆయన కొడుకు సీఎం అవ్వాలని భావిస్తాడు. అందుకోసం బాగా డబ్బు ఖర్చు చేయడంతో పాటు, ఎన్నో రాజకీయ ఎత్తు గడలు వేస్తాడు ఇది ‘లీడర్’ చిత్రం కథ. రానా చనిపోయిన సీఎం కొడుకు పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ‘భరత్ అను నేను’ చిత్రం కథ గురించి కూడా కాస్త అటు ఇటుగా ప్రచారం జరుగుతుంది. విదేశాల్లో చదువుకునే మహేష్‌బాబు కొన్ని కారణాల వల్ల రాష్ట్రంకు వస్తాడు. ఆ సమయంలోనే జరిగిన సంఘటనల కారణంగా సీఎం అవ్వాలనుకుంటున్నాడు. అనుకున్నట్లుగానే సీఎం అయ్యి లీడర్లో రానా చేసినట్లుగా మంచి పనులు చేస్తాడట. లీడర్ చిత్రంలో రానా అవినీతిపై వ్యతిరేకంగా పోరాడితే ఈ చిత్రంలో మహేష్‌బాబు విద్యా వ్యవస్థపై యుద్దం చేస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘లీడర్’ చిత్రానికి భరత్ అను నేను దగ్గర ఉంటుందని అనిపిస్తుంది.