Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారం రోజుల్లో ఈ చిత్రం 160 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ మద్య కాలంలో స్టార్ హీరోలకు ఓవర్సీస్ కలెక్షన్స్ కొమానంగా ఉంది. ఏ హీరో ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లను సాధిస్తాడో అతడే టాప్ హీరో అనే టాక్ నడుస్తుంది. అందుకే ఇటీవలే విడుదలైన ‘రంగస్థలం’ను మించి ఓవర్సీస్లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో భారీ ఎత్తున అక్కడ విడుదల చేయడం జరిగింది.
దాదాపు 1500 స్క్రీన్స్‌లలో చిత్రాన్ని విడుదల చేయడంతో ఖచ్చితంగా 5 మిలియన్ డాలర్లు వసూళ్లు అవుతాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా భరత్ అనే నేను చిత్రం నాలుగు మిలియన్ డాలర్లను వసూళ్లు చేయడం గగనం అయ్యింది. మొదటి వారం రోజుల్లో కేవలం మూడు మిలియన్ డాలర్లను మాత్రమే వసూళ్లు చేసి రంగస్థలంను బీట్ చేసేందుకు చాలా కష్టపడుతుంది. రంగస్థలం చిత్రం భారీ ఎత్తున వసూళ్లు సాధించిన నేపథ్యంలో భరత్ ఆ కలెక్షన్స్‌ను బీట్ చేయాలంటే మరింతగా ప్రేక్షకులను రాబట్టాల్సి ఉంది. కాని భరత్ ఇప్పటికే మంచి క్లారిటీతో ప్రింట్ వచ్చేసింది. ఓవర్సీస్లో భారీ కలెక్షన్స్ సాధ్యం అవ్వాలంటే కేవలం మొదటి వారంలోనే ఎక్కువ కలెక్షన్స్‌ను రాబట్టాల్సి ఉంటుంది. కాని మొదటి వారంలో మూడు మిలియన్ డాలర్లను మాత్రమే వసూళ్లు చేసిన కారణంగా రెండవ వారంలో రెండు మరో రెండు మిలియన్ డాలర్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకం లేదు.