Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల బరిలో ఉన్న బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయమంటున్నారు భూమా సిస్టర్స్. మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరి మౌనిక ఇద్దరూ నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని ఇల్లిల్లూ తిరిగి ఓట్లు అడుగుతున్నారు. సైలంట్ మెజార్టీ వీరి వైపే మొగ్గుతోందని పరిశీలకులు కూడా చెబుతున్నారు. పైగ తల్లిదండ్రులు లేని బిడ్డల్ని జగన్ టార్గెట్ చేశారన్న ప్రచారం ఓటర్ల మనసుకు సూటిగా తగిలినట్లు కనిపిస్తోంది.
ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం పెద్ద లెక్క కాదన్నారు అఖిలప్రియ. తాము వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ ఓట్లతో గెలవలేదని, భూమా బ్రాండ్ తోనే గెల్చామని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో భయాన్ని పోగొట్టడానికే అసెంబ్లీకి వెళ్లాను తప్ప, పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. దీంతో భూమా సిస్టర్స్ గెలుపుపై కాన్ఫిడెంట్ గా ఉన్నారని స్పష్టమైపోయింది.
అసలు నంద్యాలలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతోందని, 30 ఏళ్ల పాటు ఎవరూ వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదని అఖిలప్రియ చెప్పారు. మంత్రిగా వెలగబెట్టిన శిల్పా మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, పైగా తాను చేసిన అభివృద్ధి పనులే ఆయనకు గుర్తురావడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ విమర్శల్ని పట్టించుకోబోమన్న అఖిలప్రియ.. 2019లో కూడా గెలిచి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు:
ప్రియాంక జపం చేస్తున్న కాంగ్రెస్