కౌశల్ కొన్ని నెలలు క్రితం వరకు ఈ పేరు ఎవ్వరికి అంతగా తెలీదు, సినిమా లో, సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు వేసే కౌశల్ బిగ్ బాస్ కాంటెంస్ట్ గా వొచ్చిన్న కొన్ని రోజుల తర్వాత ఈ పేరు నలుమూలల వినపడింది. షో స్టార్ట్ అయినా మూడవ వరం నుండే వేలాది మంది ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు అంటే అతిశోయోక్తి లేదు, ఇది పేరు మీద ఎన్నో పేస్బుక్ పేజీ లు, 5కే రన్ లు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే వస్తుంది.. అసలు ఇంత అభిమానాన్ని ఎలా సంపాందించుకున్నాడు…? ఇంత ఫ్యాన్ బేస్ కి కారణం ఏం అయ్యి ఉంటుంది అంటే దానికి సమాధానం అతని గేమ్ ఆడే విధానం, ఓర్పు, వ్యక్తిత్వం ఇంతటి అభిమానాన్ని తెచ్చి పెట్టాయి..
బిగ్ బాస్ ఇప్పుడు ఆఖరి ఘట్టం లో ఉంది, ఇంకొక రొండు వారాలలో విజేత ఎవరనేది తెలిసిపోతుంది, ఇప్పటికే చాలా మంది కౌశల్ ఏ విన్నెర్ అవుతాడు అని అనుకుంటున్నారు, ఇతని పేరు తో ఉన్న కౌశల్ ఆర్మీ కూడా కౌశల్ నే బిగ్ బాస్ విన్నర్ గా చూడాలనుకుంటుంది. ఇదిలా ఉండగా తాజా విషయం ఏంటంటే మాస్ సినిమా లకు, హీరోలని విలన్లని మాస్ గా చూపించడం లో ప్రసిద్ధి అని పేరు తెచుకున్న బోయపాటి శ్రీను కౌశల్ కోసం ఒక మాస్ క్యారెక్టర్ సిద్ధం చేసాడు అని టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి.
జగపతి బాబు కెరీర్ అంత అయిపోయిందని అందరు అనుకునే సమయం లో లెజెండ్ ద్వారా విలన్ గా పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చాడు బోయపాటి. ఆ ఒక్క సినిమా తో జగపతి బాబు కెరీర్ గ్రాఫ్ ఆకాశానికి అంటింది .. కెరీర్ లో చెయ్యని బెస్ట్ రొలెస్ లెజెండ్ తర్వాత చేసాడంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు అదే విధం గా కౌశల్ కోసం కూడా ఒక మాస్ విలన్ క్యారెక్టర్ సిద్ధం చేసాడని టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు . ఇవే గనుకు వాస్తవం అయితే కౌశల్ కి ఇది ఒక గొప్ప అవకాశం అనుకోవచ్చు వాళ్ళ అభిమానులు కూడా కౌశల్ ని వెండి తెర మీద చూడాలని ఆశపడ్తున్నారు.. ఇప్పటికే బోయపాటి టీం సభ్యులు కౌశల్ సతీమణి తో సంప్రదింపులు జరిపారని విశ్వనీయ వర్గాల సమాచారం .