మెగా ఫ్యామిలీ నుండి కత్తి మహేష్‌కు వార్నింగ్‌

bunny vasu warnings on kathi mahesh comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత కొన్నాళ్లుగా పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్న కత్తి మహేష్‌ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ ప్రజారాజ్యం పార్టీ గురించి, ఆ పార్టీని మోసం చేసిన వారి గురించి మాట్లాడుతూ ఏ ఒక్కరిని వదిలి పెట్టను అంటూ శపథం చేశాడు. దాంతో ప్రజారాజ్యం పార్టీలో అప్పట్లో కీలకంగా వ్యవహరించిన అల్లు అరవింద్‌పై పవన్‌ స్పందించాలని కత్తి మహేష్‌ సూచించాడు. ఈ విషయమై మెగా ఫ్యామిలీ నుండి కత్తి మహేష్‌కు సీరియస్‌ వార్నింగ్‌ను బన్నీ వాసు ఇచ్చాడు. మెగా ఫ్యామిలీలో విభేదాలు పెట్టేలా కత్తి మహేష్‌ మాట్లాడుతున్నాడు అంటూ బన్నీ వాసు కాస్త సీరియస్‌గా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

another-time-kathi-mahesh-comments-on-pawan-kalyan

బన్నీ వాసు మాట్లాడుతూ.. కత్తి మహేష్‌ లేని పోని విషయాల్లో మే పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయవద్దని, పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని గుర్తుంచుకోవాలి అంటూ కత్తి మహేష్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. కత్తి మహేష్‌ నోరు అదుపులో పెట్టుకోక పోతే ఇంకా సీరియస్‌ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, మెగా ఫ్యాన్స్‌ ఓపికకు ఒక హద్దు ఉంటుందని, మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఏ ఒక్కరు ఊరుకోరు అంటూ బన్నీ వాసు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లు పవన్‌పై కత్తి మహేష్‌ ఎంతగా విమర్శలు చేసినా కూడా బన్నీ వాసు నోరు విప్పలేదు. అల్లు అరవింద్‌ పేరు బయటకు రాగానే వెంటనే కత్తి మహేష్‌పై మంటలు కక్కుతున్నాడు. బన్నీ వాసు ఈ ఆగ్రహం ముందే వ్యక్తం చేసి ఉంటే బాగుండేదని కొందరు అంటున్నారు. ఆయన పవన్‌పై అభిమానంతో కాకుండా తన గాడ్‌ ఫాదర్‌ అయిన అల్లు అరవింద్‌పై కామెంట్స్‌కే స్పందించాడని కొందరు అంటున్నారు