Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ కంటిన్యూ అవుతోంది. ఓవైపు తెలంగాణ రాష్ట్రం అడగకపోయినా.. వాళ్ల కొత్త పథకాలకు నిధులిస్తామని ప్రకటిస్తున్న కేంద్రం.. ఏపీలో మాత్రం విభనజ చట్టం మేరకు ఇవ్వాల్సిన డబ్బులకు కూడా కోత పెడుతోంది. అదేమంటే లెక్కలు చూపించాలని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తోంది. ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడిగే హక్కు కేంద్రానికి ఉందా.. లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
మోడీ మాత్రమే నీతిమంతుడు, మిగతా అందరూ అవినీతిపరులే అన్నట్లుగా ఉంది కేంద్రం వ్యవహారం. కాగ్ రాష్ట్ర ప్రభుత్వాల్ని తప్పుబట్టిందని చెబుతున్నారు. కానీ అదే కాగ్ ఏకంగా రక్షణ సన్నద్ధతనే ప్రశ్నిస్తూ.. కేంద్రాన్ని కడిగి పారేసిన సంగతి అందరికీ గుర్తుంది. మరి దీనికేం సమాధానం చెబుతున్నారని తేలాల్సి ఉంది. దేశ భద్రత ముసుగులో వాస్తవాలు కప్పిపుచ్చుతున్న మోడీ.. రాష్ట్రాలు మాత్రం పారదర్శకంగా ఉండాలని చిలక పలుకులు చెబుతున్నారు.
మోడీకి ఇప్పటికైనా ఖో చెప్పకపోతే భవిష్యత్తులో కష్టమని చాలా మంది సీఎంలు భావిస్తున్నారు. ముఖ్యంగా నిధులు ఇవ్వాల్సిన టైమ్ లో ఇవ్వకుండా లేటుగా ఇచ్చి.. ముఖ్యమంత్రులతో ఆడుకుంటున్నారని అన్నిచోట్లా అసంతృప్తి ఉంది. బీజేపీ సీఎంలు కూడా ఇదే భావనలో ఉన్నారట. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే సీఎంలంతా పీఎంపై గళమెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు: