ముందస్తుపై మోడీని నమ్మని చంద్రులు

chandrababu-and-kcr-not-believing-g-modi-about-advanced-elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా తెలివైనవారు. మోడీతో మూడేళ్ళ కాపురం తర్వాత వారికి ఆయన విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. అసలు మోడీ ఏధైనా చెప్పారంటే.. అది చేయరనే లెక్కని వాళ్లు అనుకుంటున్నారు. అందుకని మోడీ మాటలు పూర్తిగా తీసేయకుండా తమ జాగ్రత్తలో తాము ఉంటూనే.. అనుచరుల్ని కూడా అఫ్రమత్తంగా ఉంచుతున్నారు.

అవసరమైనంత వరకు ఏపీ సీఎం చంద్రబాబు భజన చేసిన మోడీ.. తీరా ప్రధాని పీఠం ఎక్కాక ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. అమరావతి శంకుస్థాపనకు వచ్చి నీళ్లు, మట్టి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరేమనుకున్నా మోడీ మాత్రం నేనింతే చాలాసార్లు ప్రూవ్ చేశారు. కనీసం రైల్వే జోన్ కు కూడా అతీగతీ లేదు. కానీ ముందస్తు ముచ్చట్లు మాత్రం ఠంచనుగా చెబుతున్నారు.

ప్రస్తుత పరిణామాల్ని బట్టి చూస్తే.. ముందస్తు ఎన్నికలు కూడా రావచ్చు.. రాకపోవచ్చని అమిత్ షా సూచనప్రాయంగా చెబుతున్నారు. అటు మోడీ కూడా ఈ విషయంలో ప్రాంతీయ పార్టీల్ని అయోమయంలో పడేస్తున్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఎన్నికలెప్పుడొచ్చినా రెడిగా ఉండాలని తమ పార్టీ కార్యకర్తలకు పురమాయిస్తున్నారు. మోడీని నమ్మడానికి వీల్లేదని కూడా చెబుతున్నారట.

మరిన్ని వార్తలు:

శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గా ఫ‌రూఖ్

బ్రిక్స్ స‌ద‌స్సులో పాకిస్థాన్‌, చైనాల‌కు ఎదురుదెబ్బ‌

వంగ‌వీటి గొడ‌వ‌పై వ‌ర్మ వివాదాస్ప‌ద కామెంట్లు