గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబుని నమ్మారు ఆయనకు అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు కూడా ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ నాలుగున్నరేళ్లలో చాలా సాధించారు. ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణానికి తలపెట్టి, మరోపక్క సోమవారాన్ని పోలవారంగా మార్చి పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కియా మోటార్స్ లాంటి ఎన్నో కంపెనీలు తీస్కోచ్చారు. రాయలసీమకు నీళ్లిచ్చారు. రీసెంట్ గా కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన కూడా చేసారు. గొప్ప రాజధాని నిర్మాణం కావాలన్నా, పెద్ద కంపెనీలు రావాలన్నా మళ్ళీ బాబే రావాలని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే గత ఎన్నికల సమయంలో ‘బాబు రావాలి.. జాబు రావాలి’ అనే స్లోగన్ లాగా ఇప్పుడు ‘మళ్ళీ నువ్వే రావాలి’ అనే స్లోగన్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఒకరకంగా ఇది టీడీపీ కార్యకర్తలు సృష్టించిన స్లోగన్ కావడంతో ఏపీ ప్రజలు నిజంగా మళ్ళీ చంద్రబాబే రావాలని కోరుకుంటున్నారా? లేదా అని ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సూటిగా సుత్తి లేకుండా ఒకే ఒక ప్రశ్న అడిగారట. అదేంటంటే మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలా? వద్దా? అనేది. ప్రతిజిల్లాలో దాదాపు నాలుగు వేల మందిని ఈ ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. వివిధ వర్గాలు, మతాలు, కులాలకు చెందిన వారు ఈ నాలుగు వేల మందిలో ఉన్నారట. మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలా? వద్దా? అన్న ప్రశ్నకు దాదాపు 64 శాతం మంది మళ్ళీ చంద్రబాబే సీఎం కావాలని, 15 శాతం మంది చంద్రబాబు పనితీరు పర్వాలేదని, 21 శాతం మంది మాత్రం ఈ ప్రభుత్వం మారిపోవాలని కోరుకున్నారట. దీంతో ఈ సర్వేతో టీడీపీ పెద్దలు హ్యాపీగా ఉన్నారట. అయితే చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వారి శాతం ఇంకా పెరగాలని అప్పుడు టీడీపీ విజయావకాశాలు మరింత పెరుగుతాయని పార్టీ భావిస్తోంది. ఆ దిశగా పని చేయాలనీ కూడా బాబు నుండి ఆదేశాలు అందయాని తెలుస్తోంది.