జనసేన అధినేత పవన్ కళ్యాన్ తనకు ప్రాణ హాని ఉందని, ఎవరో ముగ్గురు వ్యక్తులు తనను చంపీయాలని మాట్లాడుకున్న టేప్ లు తనకు లభించాయి అని ఆయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్‌కి ప్రాణహాని ఉంటే భద్రత కల్పిస్తామని అన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ తనకు ప్రాణహాని ఉందని అంటున్నారు. అలా మాట్లాడటం సరికాదు.
నిజంగా ఆయనకు సమస్య ఉంటే భద్రత కల్పిస్తాం. ఎవరిపైనైనా అనుమానం ఉందని ఆయన చెబితే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీసు బధ్రతను వద్దని తిప్పి పంపించింది ఆయనేనని పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకం ఉండాలని చంద్రబాబు అన్నారు. అలాగే నేరపూరిత రాజకీయాలను టీడీపీ ఎప్పుడూ ప్రోత్సహించలేదన్న ఆయన.. ఫ్యాక్షన్, నక్సలైట్లు, మత కలహాలను నియంత్రించామని.. గట్టి చర్యలు తీసుకోబట్టే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.