మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్ ముగింపు దశకు చేరుతోంది. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు మీడియాలో వినిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. ఉయ్యాలవాడ జీవితం ఎలా సాగింది, ఆయన సాగించిన స్వాతంత్య్ర పోరాంటం ఏలా ఉంది, ఆయన మరణం ఎలా జరిగింది అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సైరా చిత్రంలో భారీ యుద్ద సన్నివేశాలు ఉంటాయని సమాచారం అందుతుంది.
ఇక ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రతో పాటు అల్లూరి సీతారామరాజు గా కూడా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. సినిమా క్లైమాక్స్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చనిపోతుంది. దాంతో ప్రేక్షకులు నిరాశ చెందకుండా ఉండేలా ఆ తర్వాత అల్లూరి సీతారామరాజుగా చిరంజీవిని చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. తెలుగు ప్రేక్షకులు యాంటీ క్లైమాక్స్‌ను అస్సలు ఒప్పుకోరు. అందుకే ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చిరంజీవిని చూపించడం వల్ల ప్రేక్షకులను సంతోషపెట్టాలని సురేందర్ రెడ్డి ప్లాన్‌గా సమాచారం అందుతుంది. చిరంజీవి అల్లూరి పాత్రలో ఒకటి రెండు నిమిషాలు మాత్రమే కనిపించబోతున్నాడు. ఇంకా పలువురు స్వాతంత్య్ర సమరయోధులు కూడా ఈ చిత్రం క్లైమాక్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.