‘కవచం’ సినిమా వేడుకలో కాజల్ ను చోటా కే నాయుడు ముద్దు పెట్టుకున్న విషయమై సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. చోటా కే నాయుడు తాగి మరీ ఆమెను ముద్దు పెట్టుకున్నట్లుగా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఆ సమయంలో కాజల్ ఎంతగా ఇబ్బంది పడి ఉంటుందో కదా అంటూ కొందరు ముచ్చటించుకుంటున్నారు. మొత్తానికి పెద్ద ఎత్తున చోటా కే నాయుడు తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన మరీ లైట్ గా ఈ విషయాన్ని తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా ఆయన తనను తాను సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరింత ఆగ్రహంను కలిగిస్తున్నాయి.
చోటా కే నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నాకు సౌందర్య అంటే చాలా అభిమానం. ఆమె తర్వాత అంతగా నాకు కాజల్ అంటే అభిమానం. ఆమె వర్క్ స్టైల్ ఆమె నటన నాకు చాలా నచ్చుతాయి. అందుకే ఆమెను నేను అభిమానిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆమెను అభిమానించడం వల్లే ఆమెను ముద్దు పెట్టుకున్నాను. ఒక అభిమానిగా ఆమెను ముద్దు పెట్టుకున్నాను. దానికి ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఆయన చేస్తున్న సమర్ధింపు వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి. ఒక హీరోయిన్ ను అభిమానిస్తున్నాను అంటూ ముద్దు పెట్టుకోవడం ఏమైనా సంస్కారామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.