సుషాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కి గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘చి.ల.సౌ.’. ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్‌గానే రెస్పాన్స్ వస్తుంది. కామెడీతో పాటు అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయని టాక్ రావడంతో పాటు ఈ చిత్రానికి పోటీగా పెద్ద చిత్రాలు లేక పోవడంతో ఖచ్చితంగా మంచి వసూళ్లు సాధ్యం అని అంతా భావించారు. కాని ఈ చిత్రం బడ్జెట్ రికవరీ చేయడమే కష్టంగా కనిపిస్తుంది. ఈ చిత్రం దాదాపు అయిదు కోట్ల బడ్జెట్‌తో రూపొందినట్లుగా తెలుస్తోంది. కాని ఈ చిత్రం మూడు కోట్లను కూడా వసూళ్లు చేసే అవకాశం కనిపించడం లేదు. పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నా కూడా ఇలాంటి దారుణమైన కలెక్షన్స్ నమోదు అవ్వడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
‘చి.ల.సౌ’ చిత్రం మొదటి రోజు 40 లక్షల షేర్‌ను దక్కించుకుంది. అదే స్థాయిలో సినిమా కంటిన్యూ అయితే ఖచ్చితంగా మంచి వసూళ్లే నమోదు అయ్యేవి. కాని మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం కోటి షేర్‌ను క్రాస్ చేయక పోవడంతో ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీక్ డేస్ ప్రారంభం అయిన నేపథ్యంలో చి.ల.సౌ మరింతగా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. కనీసం మూడు కోట్ల షేర్ దక్కితే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లేది. కాని ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే రెండు కోట్లకు లోపే క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయిదు కోట్ల బడ్జెట్లో రెండు కోట్ల రూపాయలు శాటిలైట్ మరియు ఇతర రైట్స్ ద్వారా రానుండగా, మూడు కోట్లు వసూళ్ల రూపంలో రాబట్టాలని ప్రయత్నాలు చేశారు. కాని చిత్ర యూనిట్ సభ్యుల ఆశలు తారు మారు అయ్యాయి. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఇంకా ఛాన్స్ ఉందని, తప్పకుండా సినిమా తాము అనుకున్న స్థాయిలో వసూళ్లను సాధిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌కు ఈ చిత్రం సక్సెస్ టాక్‌ను తెచ్చి పెట్టినా, కలెక్షన్స్‌ను మాత్రం రాబట్టలేక పోయింది.