Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళంలో ఇటీవల విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రం ఎంతటి సంచలనం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన అట్లీ కుమార్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించాడు. తెలుగులో అట్లీ కుమార్‌కు ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోలు సైతం అట్లీ కుమార్‌తో సినిమాలు చేయాలని కోరుకున్నారు. మహేష్‌బాబు, అట్లీ కుమార్ల కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక అట్లీ కుమార్ ప్రభాస్‌తో పాటు అఖిల్‌లతో సినిమాను చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రెండు నెలల క్రితం ప్రభాస్ కోసం ఒక కథను అట్లీ తయారు చేసి వినిపించాడు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ ఆ తర్వాత ‘జిల్’ దర్శకుడితో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ తర్వాత అంటే 2018 చివర్లో ప్రభాస్, అట్లీ కుమార్ల కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. మీడియాలో ఇదే విషయమై కాస్త అతిగానే వార్తలు వస్తున్నాయి.
తెలుగు మరియు తమిళ మీడియాల్లో ప్రముఖంగా వస్తున్న ఈ వార్తలపై అట్లీ కుమార్ స్పందించాడు. తాను ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తన తెలుగు సినిమా ఇప్పటి వరకు ఖరారు కాలేదు అని, అసలు తెలుగు సినిమా చేస్తానో లేదో అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అఖిల్ కోసం అట్లీ కుమార్ కథ సిద్దం చేస్తున్నాడు అనే విషయంలో నిజం లేదని కూడా తాజాగా క్లారిటీ వచ్చింది. అఖిల్ మూవీ గురించి నోరు తెరచ్చి చెప్పక పోయినా తెలుగులో అట్లీ కుమార్ సినిమా ఇప్పట్లో ఉండదని తేలిపోయింది.