నాలుగేళ్ల పాటు తెలుగుదేశం బీజేపీలు కలిసి పనిచేశాయి, చిన్నచిన్న మాట పట్టింపులు ఉన్నా ఎప్పుడు ఒకరి పార్టీ మీద ఒకరు పెద్దగా బురద చల్లుకుంది గానీ, ఒకరి నేతల మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసింది గానీ లేదు కానీ ఎప్పుడయితే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటికొచ్చిందో అప్పటి నుండి పరిస్థితులు
పూర్తిగా మారిపోయాయి ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరికి మించి మరొకరు ఇరు పార్టీల నేతలు మాటలతో యుద్దాలు చేసుకుంటున్నారు. ఓవైపు టీడీపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై విమర్శలు గుప్పిస్తుంటే మరోవైపు బీజేపీ నేతలు చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు మొదలుపెట్టారు. శనివారం రోజు కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు.. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ రిపోర్టును బయటిపెట్టి కోట్ల అవినీతిని బయటపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా సీఎం చంద్రబాబుని బీజేపీ ఎంపీ గంగరాజు మెచ్చుకున్నారు.
ఈ మాటలు విన్న బీజేపీ నేతలు షాక్ తిన్నారు అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎంపీ మాటలు అలా ఉన్నాయి మరి. నిన్న ఓ కార్యక్రమంలో ముఖ్యాతిడిగా పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు ” ఏపీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప నేత అని కానీ దేశానికి, ప్రపంచానికి గొప్ప నేత ప్రధాని మోదీ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ చంద్రబాబుకి జాతీయ నేత కావాలని ఉద్దేశ్యం ఉంటె తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలని ఆయన ఒక ఉచిత సలహా కూడా పడేశారు. విభజన తర్వాత కట్టుబట్టలతో వచ్చాని చంద్రబాబు చెబుతున్నారని విభజన నాటి నుంచి నేటి వరకు ఏపీకి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో ప్రజలకి చెప్పాలని ఎంపీ కోరారు. కేంద్ర నుంచి సాయాన్ని పొంది, దాన్ని మర్చిపోతే విశ్వాసఘాతుకం అంటారని అన్ని విషయాలకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మానుకోవాలని ఆయన బాబుని కోరారు. బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు మీద మేము పోరాటం చేస్తుంటే మన నేతే ఆయన్ను పొగడడమేంటి? అని అవాక్కయిన పరిస్థితి అన్నమాట.