Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాత్రం కేసీఆర్ ఐఢియాలొస్తున్నాయి. గులాబీ రంగు బస్సుల్ని తిప్పాలని ఆయన డిసైడ్ అవడం చర్చనీయాంశమైంది. ఇంతవరకూ కేసీఆర్ కు కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. కానీ యోగి ఐడియా వెనుక కొన్ని కారణాలున్నాయట. పింక్ అంటే లేడీస్ కలర్ కాబట్టి.. లేడీస్ స్పెషల్ బస్సులు గులాబీ రంగులో ఉండాలనుకుంటున్నారట.
నిర్భయ నిధి నుంచి గులాబీ ఏసీ బస్సుల్ని సమకూర్చి.. మహిళలకు మాత్రమే కేటాయిస్తున్నారు. ఇందులో సిబ్బంది కూడా మహిళలే ఉంటారు. యూపీలో జరుగుతున్న రేప్ ల నుంచి మహిళల్ని కాపడటానికి యోగి ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ నిధులతో ఇప్పటికే యాభై బస్సులకు ఆర్డర్ కూడా ఇచ్చేశారు.
పనిలోపనిగా ఆర్టీసీ బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని డిసైడైంది యోగి సర్కారు. యూపీకి రేప్ రాజధాని అన్న చెడ్డపేరు చెరిపేయాలని యోగి చాలా తాపత్రయపడుతున్నారు. కానీ ఆయన పెట్టిన యాంటీ రోమియో స్క్వాడ్ లో పెద్ద తలనొప్పిగా మారాయన్నది పబ్లిక్ టాక్. మొత్తం మీద గులాబీ బస్సులు కనుక లక్నోలో రోడ్డెక్కితే.. హైదరాబాద్ లో కూడా బస్సులకు గులాబీ రంగేస్తారేమో.
మరిన్ని వార్తలు:
కమల్ ముందడగుతో రజని వెనకడుగు ?
గుజరాత్ దాకా విజయసాయి నెట్ వర్క్ ?