ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీ టూ ఉద్యమం అన్ని రంగాలనూ కుదిపేస్తోంది. హాలీవుడ్ నుంచి మొదలైన ఉద్యమం బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమాలకే పరిమిమతమనుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయాలనూ తాకింది. ఇటీవల బీజేపీని షేక్ చేసిన కేంద్ర మంత్రి అక్బర్ మీటూ సెగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనీ తాకింది. లైంగిక ఆరోపణలతో ఎం ఎస్ యూ ఐ జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు.
చత్తీస్ గఢ్‌కు చెందిన ఒక మహిళా కాంగ్రెస్ కార్యకర్త తన పట్ల ఫిరోజ్‌ఖాన్ అసభ్యంగా ప్రవర్తించారని గతంలో ఆరోపణలు చేసింది. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని సెప్టెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ మంత్రిని రాజీనామా చేయమని కోరుతున్న కాంగ్రెస్ తమ పార్టీలో ఇలాంటి ఆరోపణలు ఉన్నవారి మీద ద్రుష్టి పెట్టింది. ఈ నేపధ్యంలోనే ఫిరోజ్‌ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట రాకూడదనే భావంతోనే తాను రాజీనామా చేసినట్టు ఫిరోజ్‌ఖాన్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో