డామేజ్ కంట్రోల్ పనిలో డీఎస్.

D srinivas praises to KCR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కొన్నాళ్లుగా మౌనంగా వున్న సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్ మళ్లీ గొంతెత్తారు. ఆ మౌనం వెనుక కాంగ్రెస్ కి మళ్లీ దగ్గర అయ్యే వ్యూహం ఉందని వస్తున్న వార్తలు చూసి శ్రీనివాస్ అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో వుంటూ కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లోకి వెళ్లారని వస్తున్న పుకార్లకు తెర దించేందుకు ముందుకు వచ్చిన ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారు. 2014 మాత్రమే కాదు 2019 ఎన్నికల్లోనూ జనం తెరాస వైపే వున్నారని ఘంటాపధంగా చెప్పారు. ఆయన ఇలా చెప్పడానికి వెనుక కొంత తెర వెనుక కథ నడిచిందట.

తెరాస లో అయితే చేరడం, పదవి దక్కించుకోవడం డీఎస్ కి తేలిగ్గా జరిగిపోయింది. కానీ కాంగ్రెస్ లో ఉండగా 10 జనపథ్ కి సులభంగా వెళ్లిన ఆయనకి తెరాస లో కెసిఆర్ దర్శనం దొరకడం కష్టం అయ్యిందట. పైగా డీఎస్ సలహాలు, సూచనలు తీసుకునే వాళ్ళే లేకపోవడంతో ఆయన నిరాశకి గురై నిజంగానే కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపారట. ఈ విషయాలన్నీ తెలుసుకున్న కెసిఆర్ ఇటీవల డీఎస్ కి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ సంభాషణ ఎలా జరిగింది తెలియనప్పటికీ అప్పటినుంచి డీఎస్ తిరిగి కెసిఆర్ భజన మొదలెట్టారట. అయితే కొన్నాళ్లుగా కాంగ్రెస్ వైపు చూసారని జరిగిన ప్రచారంతో కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయనే రంగంలోకి దిగి డామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ లీడర్‌ సీరియస్‌

టీడీపీని కాపీ కొడుతున్న వైసీపీ

హరిబాబును రోడ్డు మీద వదిలెయ్యరులే