Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు చిత్ర సీమలో లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ఉన్నప్పుడు ఆ కుటుంబం గురించి ప్రేత్యేక వార్తలు ఏమీ వచ్చేవి కాదు సినిమా ప్రమోషన్ వార్తలు తప్ప. అంత పద్దతిగా వ్యవహారం నడిచిపొయెది (ఒకవేళ ఏమయినా అయిన మీడియా దాకా రానిచ్చేవారు కాదు) కానీ ఈ మధ్య దగ్గుబాటి సురేష్ కుమారుడు అభిరామ్ పేరు మారుమోగుతోంది. అప్పట్లోనే పెద్ద నోట్ల మార్పిడి విషయంలో అభిరామ్ పై ఆరోపణలు వచ్చాయి. ఇక నటి శ్రీరెడ్డి అయితే కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో అభిరామ్ పేరు బయటపెట్టడమే కాక. అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేసి.. అతను నన్ను లైంగికంగా వాడుకున్నాడని శ్రీరెడ్డి పేల్చిన బాంబు టాలీవుడ్ లో పెను ప్రకంపనలు పుట్టించింది. ఫలితంగా దగ్గుబాటి కుటుంబం ఇప్పటికీ బయటకి రాలేకపోతోంది. అయితే ఆ అంశం అక్కడితో ముగిసిపోగా ఇప్పుడు మరో సారి అభిరాం వార్తలలోకి ఎక్కాడు దానికి కారణం ఏంటంటే ఇటీవల దగ్గుబాటి అభిరామ్ ఫోన్‌ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారట. ఆ ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను గుర్తించి.. వాటి ద్వారా అభిరామ్ పై బ్లాక్ మెయిలింగ్‌కు దిగారట.
వాటిని సోషల్ మీడియా లో పెట్టకుండా ఉండాలి అంటే రూ.1.5కోట్లు చెల్లించాలని ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారట. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే అభిరామ్ దీనిపై పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారని తెలుస్తోంది. పోలీసుల వివర్లా ప్రకారం వారం రోజుల క్రితం అభిరామ్ ఓ రెస్టారెంట్‌లో ఉండగా పక్కా ప్లాన్ ప్రకారం అతని ఐఫోన్‌ను కొందరు గుర్తు తెలియని యువకులు దొంగిలించారు. ఫోన్ పాస్‌వర్డ్ బ్రేక్ చేసి అందులోని ఫొటోలు, వీడియోలను చూశారు. వాటిని అడ్డం పెట్టుకుని సొమ్ముచేసుకోవాలని దుండగులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఓ ఫేక్ ఈ-మెయిల్ ఐడీని క్రియేట్ చేసి దాని ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను బయట పెట్టకుండా ఉండాలంటే తమకు రూ.1.5 కోట్ల నగదు చెల్లించాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో అభిరామ్‌కు ఏం చేయాలో దిక్కుతోచక తన కుటుంబీకులకు విషయం చెప్పాడు.
అప్రమత్తమైన సురేశ్ బాబు ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను రహస్యంగా కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. వారు పంపిన మెయిల్స్ ఆధారంగా, ఫోన్‌ను ట్రాక్ చేసి నిందితులను ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. కె.రఘురామవర్మ(పశ్చిమగోదావరి జిల్లా నేలమర్రుకు చెందిన నిరుద్యోగి), ఎన్.కార్తీక్(పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన నిరుద్యోగి), తిరుమలశెట్టి నాగవెంకటసాయి(కూకట్‌పల్లిలో కూరగాయలు అమ్మే నేలమర్రు వాసి), పి.చంద్రకిషోర్(చింతల్‌లో ఉండే పశ్చిమగోదావరి జిల్లా పెందుర్రుకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి)లుగా పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేసారు. అయితే వీరిపై ఫోన్ దొంగలించాక ఫొటోలు, వీడియోలు వేరే చోట కాపీ కూడా చేసినట్టు ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అభిరాం దగ్గుబాటి కుటుంబానికి మచ్చ తెచ్చేందుకే పుట్టాడని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.