Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు కర్ణాటక తో పాటు ఆ రాష్ట్ర సరిహద్దుల్లో భీభత్సం సృష్టించిన నర హంతక దోపిడీ ముఠా కథతో దండుపాళ్యం సినిమా వచ్చి విజయవంతమైంది. ఇప్పుడు అదే సినిమా కి సీక్వెల్ గా దండుపాళ్యం 2 వస్తోంది. మొదటి పార్ట్ లో దండుపాళ్యం ముఠా ఎంత క్రూరంగా సామాన్యుల్ని చంపి దోపిడీలకు పాల్పడ్డారో చూపించారు. ముఠా కి కీలక బాధ్యతలు వహించే లక్ష్మి పాత్రలో పూజ గాంధీ అదరగొట్టేశారు. ఆమెకి ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కేవలం 3 కోట్ల బడ్జెట్ తో తయారై దక్షిణాదిన సూపర్ డూపర్ హిట్ అయ్యి దాదాపు 40 కోట్లు వసూలు చేసింది.
ఇక రెండో పార్ట్ లో కూడా దాదాపుగా పాత సినిమా నటులతో పాటు కొందరు కొత్తగా కూడా కనిపిస్తున్నారు. దండుపాళ్యం 2 లో ఈ ముఠా సభ్యుల జైలు జీవితంతో పాటు వాళ్ళు ఇలా మారడానికి కారణాలు ఏమిటి అన్న విషయం మీద దర్శకుడు శ్రీనివాసరాజు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకి బడ్జెట్ కూడా పెంచారు. ఇప్పటికే విడుదల అయిన దండుపాళ్యం 2 ట్రైలర్, మేకింగ్ వీడియో యు ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి.
మరిన్ని వార్తలు