దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ ను పెద్ద హీరోను చేయాలని ఆయన కలలు కనేవారు. కానీ ఆయన కలలు మాత్రం చివరి వరకూ నెరవేరలేకపోయాయి. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సామాన్యుడు, ఆదివిష్ణు లాంటి కొన్ని సినిమాలు చేసాడు కానీ అవీవీ సక్సెస్ ని అందించలేకపోయాయి. అలా కాలక్రమేణా అరుణ్ వెండి తెరకు దూరమ్యాడు. దానికి తోడు సినిమాలపట్ల అనాసక్తిగా ఉండేవాడని కూడా ఓ రూమర్ ఉంది. అయితే దాసరి స్వర్గస్తులైన తర్వాత ఒక్క క్షణం అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో నెగిటివ్ కమ్ పాజిటివ్ రోల్ పోషించాడు.
ఆ పాత్ర బాగున్నా, సినిమా ప్లాప్ అవ్వడంతో అరుణ్ కు ఎలివేషన్ రాలేదు. అప్పటి నుంచి మరో అవకాశం రాలేదు. నాటి నుంచి అరుణ్ ఇండస్ర్టీలో ఎక్కడా కనిపించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు, ఈసారైనా నిలదొక్కుకుండాని కొంత మంది నమ్మారు కానీ, కథ మళ్లీ మొదటికే వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క క్షణంలో ఆఫర్ కూడా అల్లు అరవింద్ కారణంగా వచ్చిందని అంటారు. తనయుడి సినిమా కాబట్టి మంచి రోల్ ఇప్పించ గలిగాడని అనేవారు. అయితే ఆ విషయాలు ఎలా ఉన్నా దాసరి లాంటి లెజెండరీ వ్యక్తి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ర్టీలో నిలదొక్కుకోలేకపోవడం అనేది దాసరి అభిమానులకు ఎప్పటికీ నిరాశే.