Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి చిన్న గడ్డి పరక దొరికినా దాన్ని పట్టుకుని ప్రాణాలు కాపాడుకోడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతూ అన్నాడీఎంకే నుంచి గెంటి వేయబడ్డ చిన్నమ్మ శశికళ టీం పరిస్థితి అలాగే వుంది. తమని ఇప్పుడు ఈ కష్టాల నుంచి ఎవరు బయటపడేస్తారా అని ఎదురు చూస్తున్నారు. జయ చనిపోయిన కొత్తల్లో ఆమె ఒకప్పుడు ఆదరణ చూపిన హీరో అజిత్ ప్రాపకం కోసం శశికళ టీం ప్రయత్నించింది. అయితే ఆయన పెద్దగా ఇంటరెస్ట్ చూపకపోవడంతో శశి టీం తనదైన ధనబలంతో తమిళ రాజకీయాల్ని శాసించింది. కానీ ఆరు నెలల కాలంలోనే అంతా తిరగబడింది.
పదవి లేదు, పార్టీ లో స్థానం లేదు, అభిమాన గణం లేదు. ఈ పరిస్థితుల్లో తన వర్గాన్ని నిలబెట్టుకోడానికి శశికళ ఆదేశాల మేరకు దినకరన్ వింత వింత ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల తమిళ సినీ రంగానికి చెందిన ఎన్నికల్లో సంచలన విజయాలు నమోదు చేసిన హీరో విశాల్ ని ముగ్గులోకి దింపడానికి దినకరన్ ప్రయత్నించాడు. విశాల్ ఇంటికి వెళ్లి మరీ శశికళకి అండగా నిలవాలని కోరినట్టు తెలుస్తోంది. సినిమా రాజకీయాలు వేరు, బయట రాజకీయాలు వేరు అని చెప్పి విశాల్ తప్పించుకోడానికి చూసినా దినకరన్ బాగా ఒత్తిడి తెచ్చారంట. ఈ ఒత్తిళ్లకు తలొగ్గితే అన్నాడీఎంకే శ్రేణుల్లో ఇంతకుముందు వినిపించే అజిత్ పేరు పోయి విశాల్ పేరు ముందుకు వస్తుందన్నమాట.
మరిన్ని వార్తలు: