ఇటీవల తెలుగు మూవీ నుంచి వచ్చిన ఒక సరికొత్త ప్రయత్నం “గామి”. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ డ్రామానే ఈ “గామి”. మరి క్రౌడ్ ఫండింగ్ మూవీ అంటూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ మంచి బజ్ ను సంతరించుకొని మొదటి మూడు రోజులు మంచి వసూళ్ళని రాబట్టేసింది.
![“గామి” ఓటిటి రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా ..? Do you know the release date of "Gami" OTT?](https://i0.wp.com/telugu.telugubullet.com/wp-content/uploads/2024/04/Untitled-design-2024-04-02T145033.137.jpg?resize=696%2C458&ssl=1)
ఇక ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటిటి విడుదల (Gaami OTT Release) కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి వారి కోసం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాం. ఈ అప్డేట్ ప్రకారం గామి ఈ ఏప్రిల్ 12న ఓటిటిలో స్ట్రీమింగ్ కు రానుంది అని సమాచారం. ఈ మూవీ డిజిటల్ హక్కులు ప్రముఖ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మరి ఇందులో ఆరోజు నుంచి అందుబాటులోకి రానుంది అని టాక్. మరి ఈ మూవీ లో అభినయ, మహమ్మద్ సమద్ తదితరులు నటించగా నరేష్ కుమారన్ సంగీతం అందించాడు అలాగే వి సెల్యులాయిడ్ వారు సమర్పణలో మూవీ రిలీజ్ అయ్యింది.