Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమ్మెల్యే’ చిత్రం మొదటి రోజు మంచి ఓపెనింగ్స్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. సినిమాపై భారీగా అంచనాలున్న నేపథ్యంలో మొదటి రోజు మాత్రం పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు సాధించింది. కాని రెండవ రోజు నుండే పూర్తిగా కలెక్షన్స్ పడిపోయాయి. మొదటి రోజు దాదాపు 4.6 కోట్ల మేరకు వసూళ్లు కాగా రెండవ రోజు మరియు మూడవ రోజు కలిసి కనీసం రెండు కోట్లు కూడా వసూళ్లు కాలేదు అంటూ సమాచారం అందుతుంది. మొదటి రోజు కలెక్షన్స్‌తో సంతోషించిన చిత్ర యూనిట్ సభ్యులు ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూసి ఢీలా పడిపోతున్నారు.
మొదటి మూడు రోజుల్లో నైజాం ఏరియాలో కనీసం 2.5 కోట్లు వస్తుందని ఆశించారు. కాని మొదటి మూడు రోజుల్లో నైజాం ఏరియాలో 1.65 కోట్లు వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక సీడెడ్‌లో మూడు రోజులకు 1.25 కోట్లు వసూళ్లు అయ్యాయి. ఓవర్సీస్లో ఈ చిత్రం భారీ రేటుకు అమ్ముడు పోయింది. కాని అక్కడ 36 లక్షలు మాత్రమే షేర్ వచ్చింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ భారీగా నష్టపోవడం ఖాయం అయ్యింది. మొత్తంగా ఈ చిత్రం మూడు రోజుకు 6.74 కోట్లు వసూళ్లు చేసింది. లాంగ్ రన్లో ఈ చిత్రం 10 కోట్లు వసూళ్లు చేయడం కూడా కష్టమే అనే టాక్ వినిపిస్తుంది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం 20 కోట్లకు అమ్ముడు పోయింది. అంటే 10 కోట్ల మేరకు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం ఖాయం అని ఇప్పటికే తేలిపోయింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు తలపట్టుకుంటున్నారు.